LOADING...
Govt Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్!

Govt Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో దాదాపు 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బెంగుళూరులో ది హిందూ నిర్వహించిన 'ది హిందూ హడిల్ 2026' చర్చాగోష్టిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన, రాజకీయాలు, సామాజిక అంశాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత 15 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం67,760ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం వెల్లడించారు.

వివరాలు

ఉద్యోగ నియమకాల్లో ఎలాంటి అవకతవకలు లేవు

దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC)ద్వారా నిర్వహించే నియామక ప్రక్రియల్లో యూపీఎస్సీ తరహా విధానాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు(AI)ప్రభావంతో ఉద్యోగ అవకాశాలపై యువతలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ నైపుణ్యాలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం వివరించారు. ఈ క్రమంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో పాటు, పాత సిలబస్‌తో కొనసాగుతున్న ఐటీఐలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

వివరాలు

అప్పుల భారమే ప్రధాన కారణమే

రైతుల ఆత్మహత్యల అంశంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అప్పుల భారం ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25,035 మంది రైతు కుటుంబాలకు చెందిన రూ.20,616 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇది దేశంలోనే అత్యధిక స్థాయిలో అమలైన రుణమాఫీ కార్యక్రమమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement