Page Loader
Rythu Bharosa: జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు.. ముగిసిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం
జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు

Rythu Bharosa: జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు.. ముగిసిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశంలో పథకానికి సంబంధించిన అంశాలను చర్చించారు. పంటలు పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలని నిర్ణయించగా, దానికి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడానికి అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని జనవరి 14వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.