గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సూరత్ జిల్లా శివార్లలోని పల్సానాలో డిసెంబర్ 18న ఈ ప్రమాదం జరిగింది. సూరత్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్‌ఎన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని బీరెన్ లదుమోర్ అహిర్‌గా గుర్తించారు. బాధితుడిని సాగర్ పాటిల్‌గా గుర్తించారు.
సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు
సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు వాహనాన్ని ట్రేస్ చేసి డ్రైవర్‌ను గుర్తించారు. ముంబయిలో అహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం అనంతరం నిందితుడు ముంబయికి వెళ్లి అక్కడి నుంచి రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాకు చేరుకున్నారు. గురవారం తిరిగి సూరత్ రాగా పక్కా ప్రణాళికతో అహిర్‌ను సూరత్ సరిహద్దు టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌ను ఢీకొట్టిన భయంతోనే తాను పారిపోయానని, పాటిల్ పరిస్థితి గురించి తనకు తెలియదని అహిర్ చెప్పినట్లు డీఎస్పీ రాథోడ్ చెప్పారు.