ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో పోలీసులు మరో పురోగతిని సాధించారు. అంజలిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు యజమాని అశుతోష్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు కారులో ఉన్న నలుగురితో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత.. అంటే తెల్లవారుజామున 4:16 గంటల సమయంలో కారు యజమాని అశుతోష్.. నిందితులతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు కారు తాళాలను అశుతోష్‌కు అందజేశారు. ఉదయం 4:52 గంటలకు.. అశుతోష్ కారును పార్క్ చేసినట్లు సీసీటీవీలో కనపడిందని పోలీసులు తెలిపారు.
దిల్లీ
ఏడో నిందితుడి కోసం గాలింపు
అశుతోష్ కంటే ముందే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో క్రిషన్, దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, మనోజ్ మిట్టల్, మిథున్ ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అమిత్ కారు నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పుడు ఏడో నిందితుడు అంకుష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పోలీసుల అరెస్టు చేసిన ఐదుగురు నిందితులకు దిల్లీ కోర్టు గురువారం మరో నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
ఈ ప్రమాదాన్ని దిల్లీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. అలాగే ఇంట్లో ఒకరిరి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.