
Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ సూరత్‌లో శనివారం ఘోరం జరిగింది. పాలన్‌పూర్ జకత్నాక్ రోడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
చనిపోయిన వారిలో ఆరుగురు విషపూరిత పదార్థాలను సేవించి చనిపోగా.. ఒకరు మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మృతులను మనీష్ సోలంకి, అతని భార్య రీటా, అతని తండ్రి కాను, అతని తల్లి శోభ, ముగ్గురు పిల్లలు దిశ, కావ్య కుశాల్‌గా గుర్తించారు. ఇంట్లో సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్
ఆర్థిక కష్టాలే కారణమా?
ఈ సామూహిక ఆత్మహత్యలకు ఆర్థిక సంక్షోభమే కారణమని తెలుస్తోంది.
అయితే పోలీసులు మాత్రం దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు.
మనీష్ సోలంకి ఫర్నిచర్ వ్యాపారంలో ఉన్నారు. అతని వద్ద 35 మంది వడ్రంగులు, కార్మికులు పని చేసేవారు.
శనివారం ఉదయం మనీష్ సోలంకికి అతని ఉద్యోగులు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందిచలేదు.
దీంతో ఉద్యోగులు అతని ఇంటికి వచ్చి పిలిచినా స్పందించలేదు. ఇక స్థానికల సాయంతో ఇంటి వెనుక ఉన్న కిటికీని పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.