NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 
    ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

    Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 09, 2023
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లోని గురుగ్రామ్,హమీర్‌పూర్ మధ్య నడిచే బస్సులో బుధవారం సాయంత్రం ఝర్సా గ్రామ సమీపంలో దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంటలు చెలరేగడంతో ఒక మహిళ, ఒక బాలిక మరణించగా,13 మందికి గాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు తెలిపారు.

    రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న గురుగ్రామ్ పోలీసు కమిషనర్ వికాస్ కుమార్ అరోరా మాట్లాడుతూ 40 మంది ప్రయాణికులు ఉన్నారని,వీరిలో ఎక్కువ మంది కూలీలు ఉన్నారని తెలిపారు.

    ప్రయాణికులు వంటగ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్నారని, బహుశా అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉండొచ్చని చెప్పారు.

    అయితే, మరిన్ని విషయాలు ఫోరెన్సిక్ నిపుణుల నిర్దారించాకే తెలియజేయగలమని పేర్కొన్నారు.

    మంటలను ఆర్పేందుకు కనీసం నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.

    Details 

    బస్సు వెనుక భాగం నుంచి మంటలు

    ఈ సంఘటన కారణంగా నగరంలోని NH-48, సర్వీస్ లేన్లు, ఇతర కనెక్టింగ్ రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

    బస్సు శిథిలాల నుంచి రెండు కాలిపోయిన మృతదేహాలను బయటకు తీసినట్లు అరోరా తెలిపారు. కనీసం 13 మంది ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి.

    వారిలో ఎనిమిది మంది గురుగ్రామ్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఐదుగురు తీవ్రగాయాలతో మెదంతా మెడిసిటీలో చికిత్స పొందిన తర్వాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు అరోరా తెలిపారు. మృతులు ఇద్దరు మాయ (25), ఆమె కుమార్తె దీపాలి (6)గా గుర్తించారు.

    ప్రాథమిక విచారణలో బస్సు వెనుక భాగం నుంచి మంటలు చెలరేగాయని అధికారి తెలిపారు.

    Details 

    బస్సుకు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ 

    ఇతర వాహనాల్లోని ప్రయాణికులు డ్రైవర్ ను అప్పటికే హెచ్చరించారు. అయితే బస్సు డ్రైవర్ అర్థం చేసుకుని బస్సును ఆపే సమయానికి మంటలు వ్యాపించాయని అరోరా చెప్పారు.

    బస్సుకు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందని,బస్సు డ్రైవర్, కో-డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్)వరుణ్ కుమార్ దహియా తెలిపారు.

    ఈ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి అయినా మనోజ్ కుమార్ మాట్లాడుతూ తాను,రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తులు మంటల గురించి బస్సు డ్రైవర్‌ను హెచ్చరించమని,బస్సు ఆగిన తర్వాత, చాలా మంది ప్రయాణికులు లోపల చిక్కుకున్నట్లు కనుగొన్నట్లు తెలిపాడు.

    మంటలను ఆర్పేందుకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు గాయపడిన పలువురు ప్రయాణికులను తాను ఇతరులతో కలిసి బయటికి తీసుకొచ్చినట్లు అతను చెప్పాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బస్సు ప్రమాదం
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బస్సు ప్రమాదం

    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  దిల్లీ
    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి  రాజస్థాన్
    పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి  పాడేరు

    ఉత్తర్‌ప్రదేశ్

    యూపీలో అమానుషం.. లెక్కలు చేయలేదని ముస్లిం విద్యార్థిపై చెంప దెబ్బ కొట్టించిన టీచర్ భారతదేశం
    ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య హత్య
    హిందూ మతమనేదే లేదు, అదంతా ఓ బూటకం.. స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రపతి
    హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి  మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025