LOADING...
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్  ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్  ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
07:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతో ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వం,అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన రాజీనామా లేఖను పంపారు. ''వ్యక్తిగత కారణాలతో తెదేపా ప్రాథమిక సభ్యత్వం,పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదా,ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవులకు రాజీనామా చేస్తున్నాను.మీరు నాపై ఉంచిన నమ్మకానికి, అందించిన సహాయానికి, కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.తెదేపా మరింత బలపడాలని,ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటున్నాను. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగనున్నాను.భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు''అని జీవీ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement