Page Loader
Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 
H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి

Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో H15N వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు ఉదయం వచ్చే వరకు అనారోగ్యంతో మరణిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజూ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ వైరస్‌ వల్ల కోళ్ల ఫారాల నిర్వాహకులు లక్షల రూపాయల నష్టం తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. H15N వైరస్‌ లక్షణాలు ప్రదర్శిస్తూ కోళ్ల మరణాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ వైరస్‌ సంక్రాంతి సమయంతో (జనవరి 13) తీవ్రత చెందింది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా 40 లక్షల కోళ్లు మరణించాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Details

నష్టపోతున్న కోళ్ల వ్యాపారస్తులు

2012, 2020లో కూడా ఇలాంటి వైరస్‌ వ్యాపించినా, ఈసారి మరింత తీవ్రత చూపిస్తుండటంతో కోళ్ల ఫారాలు వణికిపోతున్నాయి. గతంలో కూడా వైరస్‌ కారణంగా కోళ్ల మృతితో అమ్మకాలు తగ్గిపోయి, చికెన్‌ ధరలు పడిపోయాయి. ఈ వైరస్‌ కారణంగా కోళ్లలో లక్షణాలు కనిపించవు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉన్నట్టుండి కోళ్లు మరణిస్తాయి. వైరస్‌ సోకిన కోళ్ల గుండె మీద ప్రభావం చూపి గుండెపోటు వంటిది వచ్చి మరణం సంభవిస్తుందని పశువైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకిన కోడికి వ్యాక్సిన్‌ కూడా ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు.