LOADING...
Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్
తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు (హాఫ్ డే స్కూల్స్) నిర్వహించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం వడ్డించిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.

వివరాలు 

టెన్త్ పరీక్షలున్న పాఠశాలల్లో ప్రత్యేక షెడ్యూల్

పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మాత్రం టైమింగ్స్‌లో మార్పు ఉంటుంది. ఆ పాఠశాలల్లో మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. పరీక్షల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపింది.

వివరాలు 

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అనంతరం 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఎండలు తీవ్రంగా పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

Advertisement