ఉపాధి కోసం ఫ్యాక్టరీ అడిగితే.. చంద్రయాన్-4 ద్వారా పైకి పంపిస్తామన్న సీఎం
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓ మహిళను అవమానించారు. అంతటితో ఆగకుండా బహిరంగ సభలో ఆమెపై వ్యంగాస్త్రాలను విసిరారు. ఉపాధి కోసం ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళను కించపరిచేలా సీఎం అవహేళన చేశారు. చంద్రయాన్-4 ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామన్నారు. దానిపై కూర్చోవాలని ఆమెకు హుకుం జారీ చేశారు. హర్యానా సీఎం ఖట్టర్ తీరుపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి కోసం ఫ్యాక్టరీ కోరడమే ఆ మహిళ చేసిన నేరమా అని నిలదీసింది. ఇటువంటి సీఎం ఉండటం సిగ్గుచేటని మండిపడింది. సేవ చేసేందుకు ప్రజల చేత ఎన్నికైన వారే ప్రజలను ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.