LOADING...
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమ.. మీ అకౌంట్‌లో పడ్డాయా? ఇలా చెక్ చేయండి!
రైతు భరోసా డబ్బులు జమ.. మీ అకౌంట్‌లో పడ్డాయా? ఇలా చెక్ చేయండి!

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమ.. మీ అకౌంట్‌లో పడ్డాయా? ఇలా చెక్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సాయం జమ కానుంది. ఇప్పటికే మార్చిలో మొదటి విడత నిధులు విడుదల చేయగా, ఆ సమయంలో ఒక్క ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించారు. ఇప్పుడు రెండో విడతలో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనున్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు రావడం ద్వారా తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదా తెలుసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేయడం ద్వారా కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.

వివరాలు

ఎంతమందికి సాయం?

ఏవైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం సుమారు రూ.5,653 కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు భరోసా పథకం కింద మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.

వివరాలు

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

రైతులు తమ చెల్లింపు వివరాలను ఆన్‌లైన్‌లో కూడా తెలుసుకోవచ్చు అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి 'Beneficiary Status' లేదా 'Payment Status' ఎంపికను క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ లేదా పట్టాదారు పాస్‌బుక్ నంబర్ నమోదు చేయాలి 'Submit'పై క్లిక్ చేస్తే పేరు, చెల్లింపు వివరాలు, జమ అయిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తాయి అర్హతలు ఏమిటి? ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు కావాలి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి భూమి దరఖాస్తుదారుడి పేరుపైనే ఉండాలి ఆ భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలి ధరణి పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి

Advertisement

వివరాలు

ఈ పొరపాట్లు చేస్తే డబ్బులు రావు

భూమి మీ పేరుపై లేకపోతే అర్హత ఉండదు తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేస్తే సాయం అందదు బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య భూములు ఉన్నవారు అర్హులు కారు ప్రభుత్వం నిఘా అనర్హులు ఈ పథకం సాయం పొందకుండా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం, అర్హతలేని వారిని గుర్తిస్తే పథకం నుంచి తొలగించనుంది. మొత్తానికి, నిజమైన అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా సాయం అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

Advertisement