Page Loader
Heavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

Heavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించింది. ముఖ్యంగా రైతులు పంటలను కాపాడుకోవాలని తెలిపింది. ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వాలని కోరింది