
Rains: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్!
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్‌తో పాటు జంట నగరాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఆకస్మికంగా వర్షం కురిసింది.
అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, మధురానగర్, కోఠి ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడింది.
పంజాగుట్ట, బషీర్‌భాగ్, అబిడ్స్, నారాయణగూడ, చంపాపేట, సరూర్‌నగర్, మలక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో వాతావరణం చల్లబడింది.
సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లితో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైంది.
Details
గచ్చిబౌలిలో వడగళ్ల వర్షం
గచ్చిబౌలిలో కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కూడా నమోదైంది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
పొద్దంతా ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడగా, ఆకస్మికంగా వాతావరణం మారి వాన పడటంతో కొంతవరకు ఉపశమనం లభించింది.
వానతో వాతావరణం చల్లబడింది.