Page Loader
Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత 
విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత

Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ప్రమాదకర బల్లులను స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు వాటిని అక్రమంగా తీసుకురావడం సంచలనంగా మారింది. స్వాధీనం చేసినవి మొత్తం ఆరు బల్లులు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు (బ్లూ టాంగ్ లిజార్డ్స్‌) 3 , మరో మూడు వెస్ట్రన్‌ బల్లులు ఉన్నాయి. ఈ బల్లులు అత్యంత అరుదైనవి, అలాగే ప్రమాదకరమైనవిగా గుర్తించారు. అక్రమ రవాణా గురించి సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు అటవీశాఖతో కలిసి ప్రత్యేక సోదాలు నిర్వహించారు.

Details

డీఆర్ఐ అధికారులకు అప్పగించిన ఎయిర్ పోర్టు అధికారులు

ఈ సోదాల్లో బల్లుల రవాణా మార్గాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బల్లులను ప్రస్తుతానికి డీఆర్‌ఐ అధికారులు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అనంతరం వాటిని అటవీశాఖ ఆధ్వర్యంలో సరైన సంరక్షణకు తరలిస్తారు. రహస్య మార్గాల్లో దేశానికి అరుదైన వన్యప్రాణులను తరలించేందుకు చేసే ప్రయత్నాలను అరికట్టేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.