Page Loader
Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు 
Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు

Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు 

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మేనల్లుడు అగ్రరాజ్‌రెడ్డి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ వద్ద ఫోరం మాల్‌ సమీపంలో హై స్పీడులో కారుతో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో అగ్రరాజ్‌రెడ్డికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా.. అతను మద్యం సేవించి ఉన్నట్లు నిర్దారణ అయ్యిందని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీహెచ్ వెంకన్న తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. అగ్రరాజ్ కారు నడుపుతున్న సమయంలో అందులో అతని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు గచ్చిబౌలిలో పార్టీ చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కారు ప్రమాద దృశ్యాలు