Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు
మూసీ నది వైపు హైడ్రా బుల్‌డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ సమయంలో, మూసి రివర్ ఆక్రమణలను కూల్చడం మీద హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా, శని, ఆదివారాల్లో భారీగా కూల్చివేతలు జరగనున్నాయి. రెండు రోజుల్లో కూల్చివేతలను పూర్తిగా నిర్వహించే లక్ష్యంతో, హైడ్రా డే అండ్ నైట్ కూల్చివేతలు చేపట్టేందుకు అదనంగా సిబ్బందిని నియమించింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో మూసి ఆక్రమణల కూల్చివేతలకు సిద్ధమైంది.
1350 మందికి నోటీసులు జారీ చేసిన హైడ్రా..
ఇక, హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లు గుర్తించడంతో పాటు, హైడ్రా మూసి నివాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. నేడు, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో కలెక్టర్లు మూసి నివాసితుల ప్రాంతాలను సందర్శించనున్నారు. కాగా, రవాణా మరియు హైడ్రా అధికారులు ఇప్పటికే మూసి ఆక్రమణల వివరాలను సేకరించడం ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.