Loading...
Nividia: నేను పందెం కాస్తున్నా.. జెన్సన్‌ను ఇక్కడికి తీసుకురాగలను: ఓ పార్టీలో అలిస్‌ వ్యాఖ్యలు
ఓ పార్టీలో అలిస్‌ వ్యాఖ్యలు

Nividia: నేను పందెం కాస్తున్నా.. జెన్సన్‌ను ఇక్కడికి తీసుకురాగలను: ఓ పార్టీలో అలిస్‌ వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

నివిడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌, చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్‌ హువాంగ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించే ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నెట్‌థండర్‌ చీఫ్‌ పార్కర్‌ ష్మిట్‌ ఈ వివరాలను బయటపెట్టారు. 2024లో తైవాన్‌ రాజధాని తైపీలో టెక్నాలజీ రంగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఓ పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అలిస్‌ హువాంగ్‌ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా తనతో ఉన్న మిత్రులతో ఆమె ఓ సవాలు చేశారు. ''జెన్సన్‌ను మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకురాగలనని పందెం కాస్తున్నా''అని అన్నారు. ఆమె చెప్పినట్లుగానే కొద్దిసేపటికే జెన్సన్‌ అక్కడికి చేరుకున్నారు. వారితో కలిసి మద్యం సేవించారు.

వివరాలు 

తాజా వివాదంతో చైనాకు చేరిన అలిస్

ఈ ఘటన జెన్సన్‌, అలిస్‌ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోందని పార్కర్‌ ష్మిట్‌ తాజాగా మీడియాకు వెల్లడించారు.

అమెరికాలో ఎన్విడియా వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన ఆరోపణలపై పలు దర్యాప్తులు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్‌ చైనాకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె బీజింగ్‌కు చేరుకున్నట్లు ఓ అమెరికా మీడియా సంస్థ వెల్లడించింది.

వివరాలు 

అలిస్‌ను జెన్సన్‌కు పరిచయం చేసిన కాంగ్‌ వెయ్‌ ఎవరు?

ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌కు చైనాలో ఉన్న పాత మిత్రుడి ద్వారానే అలిస్‌ పరిచయమైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

చైనాకు చెందిన ఫండ్‌ మేనేజర్‌ కాంగ్‌ వెయ్‌ 2010 నుంచి జెన్సన్‌కు పరిచయం.

మరోవైపు కాంగ్‌, అలిస్‌ కలిసి హెక్సి ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనే సంస్థలో పనిచేశారు. వీరిద్దరూ భార్యాభర్తలని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

అయితే ప్రస్తుతం కూడా వారు అదే బంధంలో కొనసాగుతున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు.

1970లో జన్మించిన కాంగ్‌.. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఝాంగీ ఫండ్‌ సంస్థకు నాయకత్వం వహించారు.

చైనాలో ఫండ్‌ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచారు.

ADVERTISEMENT

వివరాలు 

అలిస్‌ను జెన్సన్‌కు పరిచయం చేసిన కాంగ్‌ వెయ్‌ ఎవరు?

2015లో అలిస్‌ ఈ సంస్థలో చేరారు. చైనాలోని వీడియో గేమ్‌ కంపెనీలకు పెట్టుబడులు సమకూర్చడం ఈ సంస్థ ప్రధాన కార్యకలాపం.

అదే సమయంలో ఎన్విడియా వీడియో గేమ్‌ల కోసం అవసరమైన చిప్‌లను తయారు చేసేది.

ఈ వ్యాపార సంబంధాల నేపథ్యంలోనే కాంగ్‌, జెన్సన్‌ మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత కాంగ్‌ ద్వారానే అలిస్‌ జెన్సన్‌కు పరిచయమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. చైనాలో కాంగ్‌ వెయ్‌పై మార్కెట్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో ఆయన భారీ మొత్తంలో జరిమానాలు కూడా చెల్లించినట్లు సమాచారం.

ADVERTISEMENT