LOADING...
Vijay: నేను ఎప్పుడూ ఇలాంటి బాధ పడలేదు : విజయ్

Vijay: నేను ఎప్పుడూ ఇలాంటి బాధ పడలేదు : విజయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కరూర్‌ ప్రచార సభలో జరిగిన బాధాకర తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ స్పందించారు. తన జీవితంలో ఇలాంటి ఘోర ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదని, హృదయం బాధతో నిండిందని పేర్కొన్నారు. తనపై ఎలాంటి తప్పు లేకపోయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు విమర్శించారు. ప్రచారంలో నన్ను చూడటానికి జనం చేరారు. వారి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. భద్రత విషయంలో ఏ తప్పుకూడదు. ప్రజలకు సురక్షితమైన సభలు మాత్రమే జరగాలని కోరాను. కానీ జరగకూడనిది జరిగింది. ఐదు జిల్లాల్లో ప్రచారం నిర్వహించినా, ఒక్క కరూర్‌లోనే ఈ సంఘటన జరిగింది.

Details

త్వరలోనే నిజాలు బయటికొస్తాయి

నిజాలు త్వరలో బయటకి వస్తాయి. మేము ఏ తప్పు చేయలేదు, అయినా పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను FIRలో చేర్చారని విజయ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు. విజయ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కూడా విమర్శించారు. "సీఎం సర్, నాపై కక్ష తీర్చాలంటే, ఇంట్లోనా ఆఫీస్‌లోనా నాకు ఏమీ చేయకండి. నా ప్రజలతోనే నాలో ఉత్సాహం కొనసాగుతుంది. నేను ఏ తప్పు చేయలేదని చెప్పారు.

Details

41 మంది మృతి

శనివారం రాత్రి కరూర్‌లో జరిగిన ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఒక్కసారిగా ఆయనకు సమీపానికి రావడం వల్ల చోటుచేసుకున్నదని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం రావాల్సిన విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా చేరడం, ఊహించినదానికంటే ఎక్కువ మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.