LOADING...
BHU Students : విద్యార్థిని దుస్తులిప్పించిన ఘటనలో భగ్గుమన్న విద్యార్థి లోకం.. భద్రత కట్టుదిట్టం
భద్రత కట్టుదిట్టం భద్రత కట్టుదిట్టం

BHU Students : విద్యార్థిని దుస్తులిప్పించిన ఘటనలో భగ్గుమన్న విద్యార్థి లోకం.. భద్రత కట్టుదిట్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 03, 2023
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఐఐటీ-బీ.హెచ్.యూ విద్యార్థినిని దుస్తులు విప్పించిన ఘోర ఘటనపై విద్యార్థి లోకం భగ్గుమంది. IIT-BHU క్యాంపస్‌లో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళా విద్యార్థినిని బలవంతంగా ముద్దుపెట్టి,ఆపై బట్టలు విప్పించిన ఘటనలో వందలాది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థిని హాస్టల్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ చర్యను వీడియో రికార్డ్ చేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు రేగాయి. ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని పేర్కొన్న విద్యార్థులు, బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఐఐటీని,బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి వేరు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యా మంత్రిత్వ శాఖకి ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తామని వర్సిటీ తెలిపింది.

details

క్యాంపస్‌లో సెక్యూరిటీ మరింత పెంచుతాం : BHU రిజిస్ట్రార్

పరిమితం ప్రవేశంతో క్లోజ్డ్ క్యాంపస్‌ సర్క్యూట్ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ పరిపాలనతో చర్చలు చేస్తామని BHU రిజిస్ట్రార్ అన్నారు. అయితే క్యాంపస్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని,త్వరలో ఇంకొన్ని సీసీటీవీలను ఏర్పాటు చేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యార్థుల కదలికలపై కూడా ఆంక్షలు ఉంటాయన్నారు. బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన తనపై వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ే కర్మన్ బాబా గుడి సమీపంలో ఉండగా,ముగ్గురు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై వచ్చి తనను బలవంతంగా ఓ మూలకు లాక్కెళ్లి గొంతు పట్టుకున్నారని, తర్వాత వివస్త్రను చేసి, వీడియో తీసి, ఫోటోలు దిగారని ఫిర్యాదులో పేర్కొంది.