IIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ ల్యాబ్‌కి గుర్తు తెలియని వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.
డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి చొరబడ్డ వ్యక్తి కంప్యూటర్ ల్యాబ్‌లో కిరోసిన్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు.
ప్రమాద సమయంలో పొగలు, మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు.
Details
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ త్యాగరాజన్, కంప్యూటర్ ల్యాబ్ హెడ్ ఏహెచ్ ప్రదీప్ అక్కడికి చేరుకొని ల్యాబ్‌ను పరిశీలించారు.
ఈ ఘటనలో ఆరు కంప్యూటర్లు, రెండు ఏసీలు, ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, నాలుగు కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడిని గుర్తించేందుకు క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.