Loading...
IIT Bombay: విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన యాజమాన్యం
విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన యాజమాన్యం

IIT Bombay: విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన యాజమాన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఐటీ బాంబే (IIT Bombay) పవయీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రొఫెసర్‌ను ఐఐటీ బాంబే యాజమాన్యం సెలవుపై పంపింది. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో పాటు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కూడా ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది. విద్యార్థి ఆత్మహత్యకు ముందు జరిగిన పరీక్ష సమయంలో సదరు ప్రొఫెసర్‌ ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయనను డీన్‌ పదవి నుంచి ఐఐటీ బాంబే తొలగించింది.

వివరాలు 

ప్రొఫెసర్‌కు ఫ్యాకల్టీ ఫోరమ్‌ మద్దతు

ప్రస్తుతం ఆయనను సెలవుపై పంపినట్లు విద్యాసంస్థ తెలిపింది.

దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఐఐటీ బాంబే స్పష్టం చేసింది.

ఈ కేసులో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా ప్రొఫెసర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.

మరోవైపు ప్రొఫెసర్‌ను విధుల నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్‌ నిరసన వ్యక్తం చేస్తోంది.

సదరు ప్రొఫెసర్‌ పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారని ఫ్యాకల్టీ ఫోరమ్‌ పేర్కొంది.

వివరాలు 

విద్యార్థి సంఘం ఏమంటోంది?

ఈ వ్యవహారంపై ఐఐటీ బాంబే విద్యార్థి సంఘ ప్రతినిధులు కూడా స్పందించారు.

ప్రొఫెసర్‌ తప్పు చేశారని తాము భావించడం లేదని వారు పేర్కొన్నారు.

అయితే విద్యార్థి మృతి ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను సంబంధిత విధుల నుంచి పక్కన పెట్టాలని మాత్రమే కోరినట్లు తెలిపారు.

దర్యాప్తు పూర్తికాకముందే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండా.. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘ ప్రతినిధులు అధికారులను కోరారు.

ADVERTISEMENT