ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
తన వస్త్రాధారణ సింపుల్‌గా ఉండటం వల్ల తాను బ్రిటన్ ప్రధాని అత్తగారిని అంటే లండన్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నమ్మలేదని సుధామూర్తి పేర్కొన్నారు.
తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న సుధామూర్తి, తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ప్రముఖ రచయితగా, సామాజిక సేవకురాలిగా చాలా సుపరిచితురాలు.
భారత సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయిన రిషి సునక్ సుధా మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. దేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో సుధామూర్తి ఒకరు అయినప్పటికీ ఆమె ఆడంబరాలకు పోరు. ఆమె వస్త్రాధారణ చాలా సింపుల్‌గా ఉంటుంది.
బ్రిటన్
ఇమ్మిగ్రేషన్ అధికారులు జోక్ చేస్తున్నారా? అడిగారు: సుధామూర్తి
ఇటీవల తాను లండన్‌కు వెళ్లానని, ఆ సమయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తాను చెప్పిన ఇంటి అడ్రస్ చూసి నమ్మలేకపోయారన్నారని సుధామూర్తి చెప్పారు.
లండన్‌లో ఎక్కడ ఉంటారని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడగ్గా, తన అల్లుడి అధికారిక నివాసమైన '10 డౌనింగ్ స్ట్రీట్' అని చెప్పానని, అదే అడ్రస్‌ను ఫామ్ పైన కూడా ఫిల్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ఆ అడ్రస్ చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు జోక్ చేస్తున్నారా? అని తనను అడిగినట్లు సుధామూర్తి వెల్లడించారు. తన వస్త్రాధారణను చూసిన వాళ్లు తాను ప్రధాని అత్తగారిని అంటే నమ్మలేకపోయారని అన్నారు.
ఈ క్రమంలో తాను ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లు వివరించారు.