LOADING...
Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి 
Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి

Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి 

వ్రాసిన వారు Stalin
Dec 17, 2023
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి మరణించగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆదివారం ఉదయం సీఆర్‌పిఎఫ్ 165వ బెటాలియన్‌కు చెందిన బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా జాగర్‌గుండ ప్రాంతంలో ఉదయం జవాన్లు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మరణించగా, కానిస్టేబుల్ రాముకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ తరువాత, ప్రాథమిక చికిత్స కోసం రామును ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ తర్వాత, నలుగురు అనుమానితులను సమీప ప్రాంతం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సీఆర్‌పిఎఫ్ కోబ్రా యూనిట్, స్థానిక పోలీసుల జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జవానుకు గాయాలు