Page Loader
పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు 
పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు

పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు 

వ్రాసిన వారు Stalin
Aug 20, 2023
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఒక గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. యూఏవీ- తపాస్ పేరుతో తయారు చేసిన ఈ డ్రోన్ ట్రయల్ రన్ కుప్పకూలిపోయినట్లు డిఫెన్స్ అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ ప్రమాదంపై డీఆర్‌డీఓ స్పందించింది. దీనిపై విచారణ జరిపి, నిర్దిష్ట కారణాలను తెలుసుకుంటామని చెప్పింది. పొలాల్లో డ్రోన్ కూలిపోవడంతో అక్కడి రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు డ్రోన్‌ను చూసేందుకు బారులు తీరారు. అయితే ఈ డ్రోన్ కూలిపోవడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డ్రోన్ కూలిపోయిన దృశ్యాలు