Page Loader
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం 
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం 

వ్రాసిన వారు Stalin
Mar 04, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్టు మందలించింది. సనాతన ధర్మాన్ని రద్దు చేయండి' అనే వివాదాస్పద వ్యాఖ్యపై సుప్రీంకోర్టు సోమవారం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులను ఒకే దగ్గరికి చేర్చాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 'మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. మీ హక్కులను మీరు దుర్వినియోగం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియదా? ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉదయనిధిని మందలించిన సుప్రీంకోర్టు