Ram Mandir: అయోధ్య రాముడి కోసం 108 అడుగుల అగరబత్తి
ఉత్తర్‌ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను ఆహ్వానించింది. వచ్చే ఏడాది అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి కోసం గుజరాత్‌ని వడోదరాలో తర్సాలీ గ్రామం అయోధ్య రాముడి కోసం మరుపురాని కనుక ఇవ్వాలని సంకల్పించింది. అందులో భాగంగా ఆ ఊరి ప్రజలు రాముడి కోసం భారీ అగరబత్తి తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు . అంతే కాకుండా ఈ భారీ అగర్‌బత్తిని గనుక వేస్తే ప్రతిరోజు రాముడికి ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందట.
3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తి
తర్సాలీ గ్రామ వాస్తవ్యుడైన విహాభాయ్ అనే రైతుకి రాముడంటే ఎనలేని భక్తి. అందుకే అందరికంటే ముందుగా 108 అడుగులు పోడవు ధూపం తయారు చేయాలని సంకల్పించారు. అనుకున్న వెంటనే 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్ మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగించి సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తిని తయారు చేస్తున్నారు. ఆయన చేసే ఈ అగరుబత్తికి గ్రామస్తులు కూడా తమవంతుగా సాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. అగరుబత్తికి కావాల్సిన ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను సమకూర్చి ఆయనకు తగినంత సాయం అందించారు.