Hormuz: భారతీయ నావికులు గల్లంతు.. హర్మూజ్ సమీపంలో నౌకపై దాడిని ఖండించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. పెట్రో డాల్ఫిన్ అనే ట్యాంకర్‌పై డ్రోన్‌తో బాంబు దాడి చేయడంతో నౌకలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంకర్‌లో 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మందిని సురక్షితంగా రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం స్థానిక తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపట్టింది.
వివరాలు
గల్లంతైన నావికుల కోసం గాలింపు
సోహార్ యాంకరేజ్ వద్ద పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. ఇద్దరు గల్లంతైనట్లు తెలిపారు.
వారి ఆచూకీ కనుగొనేందుకు స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గల్లంతైన నావికులను గుర్తించేందుకు చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు.
సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
దాడిని ఖండించిన భారత్
వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడిని భారత్ ఇప్పటికే ఖండించింది.
గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీ కోసం స్థానిక తీర రక్షక దళం చేపడుతున్న గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.