దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 12,193 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కు చేరుకుందని కేంద్రం వెల్లడించింది. కోవిడ్ కారణంగా దేశంలో మరో 42మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,300కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరుకున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.66శాతంగా ఉంది. వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తుల సంఖ్య 4,42,83,021కి పెరిగింది. మరణాల రేటు 1.18శాతం కాగా, దేశవ్యాప్తంగా 220.66 కోట్ల డోస్‌లను అందించినట్లు కేంద్రం వెల్లడించింది.