Loading...
PM Modi: యుద్ధాలు,సంక్షోభాల మధ్య భారత్‌ 7.8 శాతం జీడీపీ వృద్ధి: ప్రధాని మోదీ

PM Modi: యుద్ధాలు,సంక్షోభాల మధ్య భారత్‌ 7.8 శాతం జీడీపీ వృద్ధి: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం 26వ ఎస్సీఓ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పలు సంక్షోభాలు,యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని ఆయన తెలిపారు. దేశ ప్రజల సమష్టి కృషి, సంకల్పం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు ప్రజలు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో నిర్వహించే డెస్టినేషన్‌ వివాహాలను తగ్గించుకోవాలని సూచించారు. అలాగే అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించి 'వోకల్‌ ఫర్‌ లోకల్‌' నినాదాన్ని ఆచరణలో పెట్టాలని కోరారు.

వివరాలు 

ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధి

దేశీయ ఉత్పత్తులు, వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ విధానం మరింత బలోపేతమవుతుందని చెప్పారు.

'అబద్ధాల ప్రతిధ్వనుల'తో (ఝూఠ్ కీ గూంజ్) నిరాశను వ్యాప్తి చేస్తున్న వారిపైనా మోదీ విమర్శలు చేశారు.

దేశంలో కొందరు నిరాశకు లోనై తప్పుడు ప్రచారంతో ప్రతికూలతను పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

అయితే అలాంటి ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి భారత్‌ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు.

దేశం సాధించిన ఈ వృద్ధి భారతీయుల సమష్టి కృషికి, బలమైన సంకల్పానికి నిదర్శనమని పేర్కొంటూ ప్రజలకు అభినందనలు తెలిపారు.

'2020లో కొవిడ్‌ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడా పూర్తి స్థిరత్వం కనిపించలేదు. అయినప్పటికీ భారత్‌ మాత్రం వేగంగా ముందుకు సాగుతోంది' అని ప్రధాని అన్నారు.

వివరాలు 

స్వదేశీ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యం

ఈ ఆర్థిక వృద్ధి వేగాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌, 'వోకల్‌ ఫర్‌ లోకల్‌' విధానాలు కీలకమని స్పష్టం చేశారు.

స్వదేశీ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని మోదీ పేర్కొన్నారు.

స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తయ్యే నాటికి యువతకు 'వికసిత భారత్‌'ను అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పంతో దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటన

నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించారు.

అక్కడ ద్వైపాక్షిక చర్చలు ముగించుకున్న అనంతరం బిష్కెక్‌ చేరుకున్నారు.

ఎస్సీఓ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సహా పలువురు యురేషియా దేశాల నేతలతో ఆయన సమావేశమయ్యారు.

ప్రాంతీయ భద్రత, దేశాల మధ్య అనుసంధానత, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ చర్చల ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అబద్ధాల ప్రచారాన్ని అధిగమించి 7.8 శాతం వృద్ధి సాధించాం: మోదీ

ADVERTISEMENT