LOADING...
India-China: 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాక్‌కు చైనా సాయం.. భారత్‌ రియాక్షన్‌ ఇదే..
'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాక్‌కు చైనా సాయం.. భారత్‌ రియాక్షన్‌ ఇదే..

India-China: 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాక్‌కు చైనా సాయం.. భారత్‌ రియాక్షన్‌ ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
08:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాక్‌కు చైనా సాంకేతిక సహాయం అందించిందన్న వార్తలపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ఇలాంటి ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం వల్ల దేశ ప్రతిష్ఠ, అంతర్జాతీయ స్థానం దెబ్బతింటుందని చైనాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. పహల్గామ్‌ దాడికి ప్రతిగా భారత్‌ కచ్చితమైన లక్ష్యాలతో ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించిందన్నారు.

వివరాలు 

పాక్‌ సైనిక సామగ్రిలో 81 శాతం చైనా తయారీనే..

ఇదే సమయంలో పాక్‌కు చైనా 'ఆన్‌సైట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌' ఇచ్చినట్లు చైనా మీడియా వెల్లడించడం చర్చనీయాంశమైంది. పాక్‌ వాడుతున్న చైనా తయారీ జే-10సీఈ యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక సహకారం అందించినట్లు చైనా ఇంజనీర్‌ జాంగ్‌ హెంగ్‌ వెల్లడించారు. కాగా, పాక్‌ సైనిక సామగ్రిలో 81 శాతం చైనా తయారీదేనని ఇప్పటికే భారత ఆర్మీ పేర్కొంది. పాక్‌ను చైనా తన మిలిటరీ టెక్నాలజీ పరీక్షల కోసం 'లైవ్‌ ల్యాబ్‌'లా ఉపయోగిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement