Page Loader
Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..
కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
09:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ పై వ్యతిరేకంగా భారత్ ప్రతీకార దిశగా ముందడుగు వేసింది. ఈ క్రమంలో 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన "సింధు జలాల ఒప్పందం"ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ కీలక నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో నిర్వహించిన సీసీఎస్ (భద్రతపై కాబినెట్ కమిటీ) భేటీ అనంతరం వెలువడ్డాయి.

వివరాలు 

 రాయబార కార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గింపు 

ఇంకా భారత్ పాకిస్తాన్‌తో అన్ని రకాల దౌత్య సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు రెండు రోజులలోపు దేశాన్ని విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఇప్పటికే జారీ చేసిన పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయ సిబ్బందిని 55 నుండి 30కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా, ఆ కార్యాలయంలో పని చేస్తున్న సైనిక సలహాదారులు భారత్‌ను విడిచి వెళ్లాల్సిందిగా సూచించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న విక్రమ్‌ మిస్రీ