Page Loader
భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ
భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ

భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ

వ్రాసిన వారు Stalin
Jun 06, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీటి అడుగున లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత నౌకాదళం, డీఆర్‌డీఓ సంయుక్తంగా మంగళవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ బరువు గల టార్పెడోను విజయవంతంగా పరీక్షించాయి. ఇది భారత నేవీ, డీఆర్‌డీఓ పరిశోధనలో కీలక మైలురాయిగా నౌకాదళం ట్విట్టర్‌లో పేర్కొంది. ఇది ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తితో భవిష్యత్ పోరాట సంసిద్ధతకు ఇదొక సూచిక అని నావికా దళం చెప్పింది. అయితే ఈ హెవీ వెయిట్ టార్పెడో గురించి పూర్తి సమాచారాన్ని నేవీ వెల్లడించలేదు. నీటి అడుగున బెదిరింపులను ఎదుర్కోవడం, సముద్ర కార్యకలాపాలను పర్యవేక్షించడం, నిఘా కార్యకలాపాలు నిర్వహించడం వంటి విషయాల్లో నేవీ సామర్థ్యాన్ని ఈ హెవీ వెయిట్ టార్పెడో మరింత బలోపేతం చేస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టార్పెడో ప్రయోగ దృశ్యం