Page Loader
ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం
ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం

ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం

వ్రాసిన వారు Stalin
Oct 08, 2023
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్దం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రజలతో పాటు భారతీయ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 18వేల మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లవద్దని సూచించినప్పటికీ, అక్కడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్నారు. అనేక మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచెతిలో పెట్టుకొని నిరంతరం భయపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు భారతీయ విద్యార్థులు తమ కష్టాలను మీడియాలో పంచుకున్నారు.

గేమ్

ఇండియన్ ఎంబసీతో టచ్‌లోనే ఉన్నాం: విద్యార్థి

తమిళనాడుకు చెందిన గోకుల్ మనవలన్ అనే భారతీయ విద్యార్థి తన అనుభవాన్ని ఏఎన్ఐతో పంచుకున్నారు. తాను చాలా భయాందోళనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తమకు భద్రతగా ఇజ్రాయెల్ పోలీసు బలగాలు ఉన్నాయని వివరించాడు. ప్రస్తుతం తాము సురక్షితంగా ఉన్నామని, ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉన్నట్లు, అలాగే సమీపంలోని భారతీయులతో కూడా నిరంతరం మాట్లాడుతున్నట్లు గోకుల్ వెల్లడించారు. ఆదిత్య కరుణానిధి నివేదిత అనే విద్యార్థి మాట్లాడుతూ.. హమాస్ తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 5:30 గంటలకు తమకు సైరన్ వచ్చిందన్నారు. తాము 7-8 గంటల పాటు బంకర్లలోనే ఉన్నామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏఎన్ఐతో మాట్లాడుతున్న విద్యార్థి