Page Loader
IndiGo: అది ఇండిగో విమానమా .. నాటు పడవా ? 
IndiGo: అది ఇండిగో విమానమా .. నాటు పడవా ?

IndiGo: అది ఇండిగో విమానమా .. నాటు పడవా ? 

వ్రాసిన వారు Stalin
May 22, 2024
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

సర్వసాధారణంగా బస్సులు , రైళ్లు, నాటు పడవలు పరిమితికి మించి ప్రయాణికులు పయనించటం గురించి విన్నాం,చూశాం. ఈ సారి ఆ వంతు విమానాలకు వచ్చింది. అదేదో విమానం కాదండీ.. ఇండిగో విమానం. సాధారణంగా పరిమితికి మించి ప్రయాణికులు ఉంటే ఓవర్ లోడ్ అయినట్లే . అదేదో సినిమాలో విమానంలో నిల్చొనే పని లేకుండా చూడమని అడిగినట్లుగా ఉంది . ఇండిగో సంస్ధ రోజూ ముంబై నుంచి వారణాసికి రెగ్యులర్ విమానాలు నడుపుతోంది. అలాగే మంగళవారం సాయంత్రం 7.30 కి 6E 6543 ఓ వ్యక్తి ..విమానం వెనుక వేలాడుతూ కనిపించాడు. ఆయన ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సి ఉంది.

Details 

 టికెట్ కన్ఫార్మ్ అయినప్పటికీ ఎందుకు..ఇలా?  

ఇది గమనించిన సిబ్బంది విమానాన్ని మళ్లీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి (CSMIA) వెనక్కి తీసుకు వచ్చింది. ఇందుకు కారణమైన ఆ వ్యక్తిని కిందకు దింపి యధాతధంగా వారణాసికి వెళ్లి పోయింది. దీంతో విమానాశ్రాయ అధికారులు ,ఇండిగో ఎయిర్ లైన్స్ ఊపిరి పీల్చుకున్నాయి. అతనికి టికెట్ కన్ఫార్మ్ అయినప్పటికీ ఎందుకు ఈ పని చేశారో తెలియదని ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపింది.