LOADING...
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జగదల్పూర్‌కు సమీపించే సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అవసరమైన అనుమతులు లభించకపోవడంతో పాటు వాతావరణం కూడా అనుకూలించలేదు.

వివరాలు

తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న విమానం

ఈ పరిస్థితుల్లో పైలట్ అప్రమత్తమై ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన అనంతరం విమానానికి అవసరమైన ఇంధనాన్ని (ఫ్యూయల్) నింపారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో, అదే విమానం ప్రయాణికులతో కలిసి తిరిగి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరింది.

వివరాలు

విమానంలో 60మంది ప్రయాణికులు

ఈ విమానంలో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే విమానాశ్రయ అధికారులు, సిబ్బంది తీసుకున్న తగిన భద్రతా చర్యలతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. చివరికి అన్ని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

Advertisement