Telangana Govt: జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ భీమా' ప్రారంభం.. అర్హులకు రూ.5 లక్షల ఉచిత బీమా!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరమ్మ భీమా' పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల ఉచిత భీమా రక్షణ కల్పించనున్నారు. కుటుంబంలో అనుకోని ప్రమాదం లేదా విపత్తు సంభవించినప్పుడు ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా నిలవడం ఈ పథక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
వివరాలు
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలు, పొదుపు సంఘాలకు రూ.1 లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
ఇందిరమ్మ ఇళ్లకు మరింత ఊతం
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అదనంగా మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఆరు గ్యారంటీల అమలులో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు 'ఇందిరమ్మ భీమా' పథకం ద్వారా రాష్ట్రంలోని కోట్లాది కుటుంబాలకు మరింత భరోసా కల్పించేందుకు సిద్ధమవుతోంది.