3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్
జియో అనుబంధ సంస్థ ముంబై రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌బిఐ ఎస్క్రో ఖాతాలో రూ. 3,720 కోట్లు జమ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నవంబర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలుపై జియోకు ఆమోదం తెలిపింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో తన తమ్ముడు అనిల్ అంబానీ నిర్వహణలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ టవర్, ఫైబర్ ఆస్తిని కొనుగోలు చేయడానికి 2019 నవంబర్ లో రూ. 3,720 కోట్ల బిడ్‌ను దాఖలు చేసింది. 3,720 కోట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలని ట్రిబ్యునల్ జియోను కోరింది.
కొన్ని బ్యాంకులు నిధుల పంపిణీపై న్యాయ పోరాటం చేస్తున్నాయి
నవంబర్ 6న, దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలును పూర్తి చేయడానికి రూ. 3,720 కోట్లను ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేయాలని జియో ప్రతిపాదించింది. క్రెడిటర్స్ కమిటీ ఇప్పటికే మార్చి 4, 2020న 100 శాతం ఓటుతో జియో రిజల్యూషన్ ప్లాన్‌ను ఆమోదించింది, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కి దాదాపు 1,78 లక్షల ఫైబర్ ఆస్తులు ఉన్నాయి. రుణదాతల మధ్య వివాదం ముగిశాక వారికి నిధులు పంపిణీ చేయబడతాయి SBI, దోహా బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఎమిరేట్స్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు నిధుల పంపిణీపై న్యాయ పోరాటంలో ఉన్నాయి. పరోక్ష రుణదాతలను ఆర్థిక రుణదాతలుగా వర్గీకరించడాన్ని దోహా బ్యాంక్ సుప్రీంకోర్టులో చేసిన సవాలు పెండింగ్‌లో ఉంది.