Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు
బెంగళూరు టెకీ ఆత్మహత్య తరువాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా, అతుల్ సుభాష్ తండ్రి తన కొడుకులు జీవితం ముగించుకున్న కారణంగా భార్య, ఆమె బంధువుల వేధింపులను తట్టుకోలేకపోయాడని విచారం వ్యక్తం చేశారు. అతని వాదన ప్రకారం, భార్య తనపై వేసిన కేసుల నుండి విముక్తి పొందేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని జడ్జి అతుల్ సుభాష్ నుండి డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. అతుల్ సుభాష్, నిఖిత సింఘానియా 2019లో వివాహం చేసుకున్నారు. కానీ, కొన్ని సంవత్సరాల తరువాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు అతుల్ తండ్రి పవన్ కుమార్ వెల్లడించారు. దీని తరువాత నిఖిత, సుభాష్‌ను విడిచి బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్ కు వెళ్లింది.
రూ.5 లక్షలు ఇవ్వాలని జడ్జి డిమాండ్
అక్కడ ఆమె తల్లి, సోదరితో కలిసి అతుల్ పై అనేక అప్రాధిక కేసులు పెట్టింది. ఈ కేసుల విచారణ కోసం అతుల్ 40కి పైగా సార్లు బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లి వచ్చాడని అతని తండ్రి తెలిపారు. ఇక, న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతుండగా, పర్యవేక్షణ చేస్తున్న జడ్జి సమస్యను పరిష్కరించడానికి రూ.5 లక్షలు అడిగినట్లు పవన్ కుమార్ ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము రెడీనట్లు చెప్పుకొచ్చారు. మొదట రూ.20 వేల డిమాండ్ చేసి, ఆపై అది రూ.40 వేలకు పెంచారని ఆయన పేర్కొన్నారు. చివరకు, సెటిల్మెంట్ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని జడ్జి డిమాండ్ చేశాడని పవన్ కుమార్ వివరించారు.
బికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ నేపథ్యంలో, బెంగళూరు మారతహళ్లి పోలీసులు అతుల్ సుభాష్ మృతికి సంబంధించిన దర్యాప్తును వేగంగా సాగిస్తున్నారు. మృతుని సోదరుడు బికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం యూపీలోని జౌన్‌పూర్ ప్రాంతానికి వెళ్లి, నిఖిత సింఘానియా, ఆమె తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్ కోసం గాలించారు. మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా బిహార్‌లో పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.