Page Loader
Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు
అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు

Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు

వ్రాసిన వారు Stalin
Nov 01, 2023
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు బ్లాకుల్లో స్తంభాలు పడిపోవడం, పగుళ్లు కనిపించడం మరచిపోకముందే.. తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీలు ఏర్పడటం సంచలనంగా మారింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో నిర్మించిన అన్నారం బ్యారేజీలో బుధవారం లీకేజీని గుర్తించారు. రెండు గేట్ల వద్ద లీకేజీ కారణంగా నీరు బయటకు ఉబికి వస్తున్నట్లు గమనించారు. దీంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు భయాందోళనకు గరవుతున్నారు. గేట్లు మూసి వేసిన తర్వాత కూడా.. 28, 38 గేట్‌ల ద్వారా కొంత నీరు బయటకు వెళ్లడాన్ని గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు ఇసుక బస్తాలతో లీకేజీని ఆపే ప్రయత్నం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్యారేజీలో లీకులను అడ్డుకునేందుకు ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యం

మీరు పూర్తి చేశారు