KCR: ఫామ్‌హౌస్‌కు వచ్చి వ్యవసాయం చేసుకుంటా: కేసీఆర్
తుంటి ఎముక సర్జరీ అనంతరం హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారు. తాజాగా కేసీఆర్..ములుగు మండలం వంటిమామిడికి చెందిన బాపురెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. తాను పదిరోజుల్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటానని బాపురెడ్డికి కేసీఆర్ చెప్పారు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు పంపాలని వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, గజ్వేల్‌కు వచ్చాక.. అందరినీ కలుస్తానని కేసీఆర్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఎరువులన్నీ ఫామ్‌హౌస్‌కు పంపాలని కోరారు. దీంతో బాపురెడ్డి కూడా ఎరువులను పంపిస్తానని కేసీఆర్‌కు చెప్పారు.