
నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని అర్చకుల ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం నాగపూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వకోద్కర్ కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో కుర్చిలో కూర్చుకున్నారు.
'అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు నాగపూర్‌లో ఘన స్వాగతం లభించింది.
బీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కేసీఆర్
BRS President, CM Sri KCR along with party leaders on Thursday inaugurated the BRS party office in Nagpur of Maharashtra state and hoisted the flag at the office. pic.twitter.com/rlXaFCDoPr
— BRS Party (@BRSparty) June 15, 2023