NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఎలా పొందచ్చో కీలక ఆదేశాలు కారి చేసిన కలెక్టర్ 
    తదుపరి వార్తా కథనం
    Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఎలా పొందచ్చో కీలక ఆదేశాలు కారి చేసిన కలెక్టర్ 
    వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఎలా పొందచ్చో కీలక ఆదేశాలు కారి చేసిన కలెక్టర్

    Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఎలా పొందచ్చో కీలక ఆదేశాలు కారి చేసిన కలెక్టర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం సంభవించిందని తెలిసిందే. ఈ వర్షాలు, వరదలతో మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

    వరద ప్రభావిత ప్రాంతాల్లో పలు ఇళ్లు తీవ్రంగా నష్టపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా ఇళ్లలోని వస్తువులు,నిత్యావసరాలు పాడయ్యాయి. అలాగే సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు కూడా కోల్పోయారు.

    ఈ పరిస్థితి దృష్ట్యా, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంపు ప్రాంతాల్లో సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లను కోల్పోయిన వారికి ''నా ఖమ్మం కోసం నేను'' కార్యక్రమం ద్వారా తిరిగి జారీ చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

    దీనికి ప్రత్యేక బృందాలు,శిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

    వివరాలు 

    కొత్త సర్టిఫికెట్లు జారీ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సూచనలు

    సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో వరదతో సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు కోల్పోయిన వారికి కొత్త సర్టిఫికెట్లు జారీ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేశారు.

    ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిని మినహాయించి, గ్రామీణ ప్రాంతాలు, సత్తుపల్లి, వైరా, మధిర పట్టణ ప్రాంతాల్లో 72 బృందాలను ఏర్పాటు చేశారు.

    ఈ బృందాలు ముంపు ప్రాంతాల్లో 10 రోజులు సర్వే చేస్తాయి. దరఖాస్తులు స్వీకరించేవి. ఇంటి యజమాని లేదా వారి పిల్లలకు సంబంధించి కోల్పోయిన సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను దరఖాస్తు రూపంలో తీసుకుని, ఆ తర్వాత సంబంధిత శాఖల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

    వివరాలు 

    అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైతే, హాట్‌లైన్ నెంబర్

    సర్టిఫికెట్లు లామినేషన్ చేసి, ఇంటి వద్దే అందజేస్తామని, సర్టిఫికెట్ల జారీకి కావలసిన సేవలు, ధరణి, ఇతర రుసుములు, లామినేషన్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

    ప్రత్యేక బృందాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ తర్వాత ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

    అంతే కాకుండా, విదేశాల్లో అడ్మిషన్లు లేదా ఉద్యోగాల కోసం అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైతే, హాట్‌లైన్ నెంబర్ 1077ను సంప్రదించాలని, 9063211298 వాట్సాప్ నెంబర్‌కు రుజువులు సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.

    అటువంటి వారికి వారం రోజుల్లో ప్రొవిజనల్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పారు.

    వివరాలు 

    ముంపు ప్రభావిత 14 డివిజన్లలో ప్రత్యేక శిబిరాలు

    ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ముంపు ప్రభావిత 14 డివిజన్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు కోల్పోయినవారి నుంచి దరఖాస్తులు స్వీకరించబడతాయి.

    నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలు, ఐటీ హబ్, ధంసలాపురం మండల పరిషత్ పాఠశాల, గీతాంజలి పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాత డీఆర్‌డీవో కార్యాలయం, గాంధీ చౌక్ ప్రభుత్వ మహిళా కాలేజ్, రామన్నపేట రైతు వేదిక వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఖమ్మం

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఖమ్మం

    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025