Loading...
Komatireddy Rajagopal Reddy: బుల్లెట్‌ దిగాల్సింది...కొంచెంలో మిస్సయింది
బుల్లెట్‌ దిగాల్సింది...కొంచెంలో మిస్సయింది

Komatireddy Rajagopal Reddy: బుల్లెట్‌ దిగాల్సింది...కొంచెంలో మిస్సయింది

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే మరో కురుక్షేత్రం సృష్టిస్తానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వానికే గట్టి హెచ్చరిక చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇబ్బంది లేదని, నియోజకవర్గానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికను ప్రస్తావిస్తూ.. 'మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయింది' అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ తిరిగే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

Details

కొడంగల్‌కు వేల కోట్లు.. మునుగోడుకు ఎందుకు ఇవ్వరు?

బుధవారం నల్గొండలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రుల నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తున్న తీరును ప్రస్తావించారు.

సీఎం కొడంగల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తుచేశారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాకపోతే రూ.20 వేల కోట్లు తీసుకెళ్లినా తనకు అభ్యంతరం లేదని, మునుగోడుకు నిధులు అడిగితే మాత్రం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి మాట్లాడే భాషపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Details

మూడు లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

మునుగోడు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడే ఉంటానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

నియోజకవర్గానికి సాగునీరు తీసుకొచ్చి సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.

రైతుబంధు పథకం విషయంలోనూ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. నిజంగా వ్యవసాయం చేసే రైతులకే ఆర్థిక సాయం అందేలా చూడాలని, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యవసాయం చేయని వారికి కూడా పథకం ప్రయోజనం అందుతోందని విమర్శించారు.

దీనివల్ల కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

Details

సొంత ప్రభుత్వంపై మాట్లాడితే తప్పేంటి?

తాను ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకూడదా అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.

ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందిస్తానని, తప్పులు కనిపిస్తే ఉన్నది ఉన్నట్లు చెబుతానని అన్నారు.

విమర్శలు చేయడానికి ప్రతిపక్షంలోనే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ల కోసం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆయన ఆరోపించారు.

అప్పట్లో పనిచేసిన కాంట్రాక్టర్లే ఇప్పటికీ కొనసాగుతున్నారని విమర్శించారు.

ADVERTISEMENT

Details

హామీలు నెరవేర్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ప్రస్తుత ప్రభుత్వానికి ఎక్కువ నిధులు సరిపోతున్నాయని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఉన్న హైదరాబాద్ నగర సమస్యలను పరిష్కరించకుండా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం ఎందుకని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నదే తమ ఆకాంక్ష అని కూడా పునరుద్ఘాటించారు.

సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

ADVERTISEMENT