Loading...
Rahul Gandhi: భారత్‌ ఆర్థిక సంక్షోభం దిశగా పయనం.. నిరుద్యోగంపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత్‌ ఆర్థిక సంక్షోభం దిశగా పయనం.. నిరుద్యోగంపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi: భారత్‌ ఆర్థిక సంక్షోభం దిశగా పయనం.. నిరుద్యోగంపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, విద్యా వ్యవస్థలోనూ అనేక లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సోమవారం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజం చెప్పాలంటే భారత్‌ ఆర్థిక విపత్తు అంచున ఉంది. ఇదే వాస్తవం. దీన్ని ఎవరైనా పక్కన పెట్టవచ్చు. మీడియా కూడా పట్టించుకోకపోవచ్చు. కానీ దేశంలో భారీ నిరుద్యోగ సమస్య ఉంది. విద్యా వ్యవస్థ కూడా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

వివరాలు

యువత, తల్లిదండ్రుల మధ్య కెరీర్‌ విషయంలో అంతరం

యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య కెరీర్‌ అవకాశాల విషయంలో అంతరం పెరుగుతోందని రాహుల్‌ గాంధీ అన్నారు.

ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన, చదువుకున్న యువత తమ ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

తమకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయనే నమ్మకం వారిలో కనిపించడం లేదని వివరించారు. మేము ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నాం.

దీనికి గల కారణాలను పరిశీలించాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యువత తమ భవిష్యత్తును స్పష్టంగా చూడలేకపోతున్నారు.

తమకంటూ ఓ భవిష్యత్తు ఉందనే భావన వారిలో లేదని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు

ఓటు చోరీ ఆరోపణలు.. ఎన్నికల సంఘంపై విమర్శలు

ఇదే కార్యక్రమంలో ఎన్నికల సంఘంపైనా రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

ఓటు చోరీ (Vote Chori) ఆరోపణలను మరోసారి ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా చెల్లుబాటు అవుతాయని మేము ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాం.

అయినా వారు మౌనంగానే ఉంటున్నారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాకుండా ఏమీ జరగదు. దీనిపై మేము పనిచేస్తున్నాం.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి'' అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

వ్యవస్థలోని వ్యక్తులు మాతో మాట్లాడుతున్నారు

ప్రభుత్వ వ్యవస్థలోని కొందరు వ్యక్తులు ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారని రాహుల్‌ గాంధీ వెల్లడించారు.

ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ప్రభుత్వం హింసకు పాల్పడే అవకాశం ఉందని వారు భయపడుతున్నట్లు తెలిపారు.

వ్యవస్థలోని వ్యక్తులు భయంతో మాతో మాట్లాడుతున్నారు. ఒక దశ దాటిన తర్వాత ఒత్తిడి మరింత పెరిగితే.. ప్రభుత్వం దానికి ప్రతిస్పందనగా హింసకు దిగవచ్చని నేను ఆందోళన చెందుతున్నాను. గతంలో భయపెట్టే వాతావరణం ఉండేది.

కానీ ఇప్పుడు ప్రజలు భయపడటం మానేశారు. ఇందులో విద్యార్థి ఉద్యమం కీలక పాత్ర పోషించిందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌ను అవమానిస్తున్నారంటూ రాహుల్‌పై బీజేపీ విమర్శలు

విదేశీ గడ్డపై భారత్‌ను అవమానిస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీని 'భారత్‌ వ్యతిరేక ప్రచార నేత'గా అభివర్ణించారు.

దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు సహజంగానే ద్వేషం ఉందని ఆరోపించారు. బెంగాల్‌ మంత్రి దిలీప్‌ ఘోష్‌ కూడా రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

భారత్‌ జీడీపీ ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది. మన విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంది.

ప్రజలు సంతోషంగా ఉన్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT