KTR Bus Yatra: నవంబర్ 11 నుంచి మేడిగడ్డ నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ సభ
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.
వివరాలు
రైతుల సాగునీటి కష్టాలను ఎండగట్టడమే లక్ష్యం
మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ను పురస్కరించుకుని నవంబర్ 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
2009లో కేసీఆర్ను అరెస్టు చేసిన అలుగునూరు లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు.
ఈ సభకు సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.