Page Loader
Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి
కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి

Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభ మేళా కోసం కోట్లాది భక్తజనాలు చేరుకుంటున్నారు. అయితే ఈ ఘట్టంలో స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండడం లేదు. ఈ అద్భుత పరిణామానికి కారణం జపనీస్‌ సాంకేతికత 'మియవాకి'. కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. అయితే ఈ మహాఘట్టం కోసం యోగి సర్కారం రెండేళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి, కసరత్తు మొదలుపెట్టింది. ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ 'మియవాకి' టెక్నిక్‌ను ఉపయోగించి, నగర పరిధిలో చిట్టడవిని తయారు చేసింది. నగరంలో పదిచోట్ల 18.50 ఎకరాల ఖాళీభూమిలో 5 లక్షలకుపైగా 63 రకాల మొక్కలు నాటారు.

Details

మియవాకి కోసం రూ.6 కోట్ల ఖర్చు

ఇవి ఇప్పుడు పెద్ద చెట్లుగా ఎదిగి, ప్రతిరోజూ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. 'మియవాకి' టెక్నిక్‌తో ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపాలిటీ దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రత్యేక సాంకేతికతలో, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలను నాటి పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టులో నాటిన 63 రకాల చెట్లలో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టును మూడేళ్ల కాలానికి ఒక కంపెనీకి అప్పగించారు.