నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ
కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు. లలితే మోదీ కుటుంబ ఆస్తులన్నీ 'కేకే మోదీ ఫ్యామిలీ ట్రస్ట్' ఆధీనంలో ఉన్నాయి. లలిత్ మోదీ ఆ ట్రస్టులో సభ్యుడు. ట్రస్ట్ ఆస్తులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. తల్లి, సోదరితో ఆస్తికోసం కోర్టులో లలిత్ మోదీ పోరాడుతున్నారు. తన సోదరి, తల్లితో ఇప్పటికే అనేక సార్లు చర్చించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఇది చాలా బాధాకరమని లలిత్ మోదీ పేర్కొన్నారు.
కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తూ లలిత్ మోదీ చేసిన ట్వీట్
కుమార్తెతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా: మోదీ
తన కొడుకును వారసుడిగా నియమించే విషయం కుమార్తె అలియాతో కూడా చర్చించినట్లు ఈ సందర్భంగా లలిత్ మోదీ చెప్పారు. ట్రస్టు సభ్యుడిగా తన స్థానంతో తన కుమారుడు రుచిర్ మోదీని సిఫార్సు చేసినట్లు వివరించారు. ట్రస్ట్ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలన్నీ తన కుమారుడికే దక్కాలని చెప్పారు. 'కేకే మోదీ ఫ్యామిలీ ట్రస్ట్' డీడ్‌లోని ఒక క్లాజ్‌ను ఉటంకిస్తూ.. కేకేఎంఎఫ్టీలోని ఎల్‌కేఎం బ్రాంచ్ తదుపరి అధిపతిగా తన కుమారుడు రుచిర్ మోడీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. తాను ఫ్యామిలీ ట్రస్ట్ లబ్ధిదారుని పదవికి రాజీనామా చేస్తున్న్టట్లు ప్రకటించారు.