
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. అత్యవసరంగా దిల్లీకి తరలింపు!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పాట్నాలోని నివాసంలో ప్రాథమిక చికిత్స అందించగా, వైద్యులు ఆయనను వెంటనే ఢిల్లీకి వెళ్లాలని సూచించారు.
రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ.. పాత గాయంతో కూడిన సమస్యల కారణంగా మరింత అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఈరోజు ఢిల్లీకి తరలించనున్నారు.
Details
వైద్యుల పర్యవేక్షణలో లాలూ
2022లో పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ, ఆరోగ్య సమస్యల కారణంగా రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. చాలా రోజుల పాటు అక్కడే ఉన్నారు.
అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని చీఫ్ డాక్టర్ విద్యాపతి సూచించారు.
2024లోనూ అనారోగ్యంతో బాధపడిన లాలూ ప్రసాద్ యాదవ్.. అప్పటి నుంచి తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ప్రస్తుతం రబ్రీ దేవి నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే ఢిల్లీలో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు సమాచారం.