తదుపరి వార్తా కథనం

Vijayawada: విజయవాడ మెట్రో ప్రాజెక్టు .. భూసేకరణకు వేగం పెంచిన అధికారులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 11, 2025
04:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో అవసరమైన భూసేకరణ అంశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో గన్నవరం, కేసరపల్లి ప్రాంతాల్లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, రెవెన్యూ అధికారులు కలిసి విజయవాడ మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ జి.పి. రంగారావుతో కలిసి పర్యటించారు.
బస్టాండ్, హెచ్‌సీఎల్, కేసరపల్లి కూడలిలో 12.42 మీటర్ల వెడల్పుతో నిర్మించబోయే మెట్రో స్టేషన్‌లకు అవసరమైన భూముల సేకరణపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
విజయవాడ మెట్రో ప్రాజెక్టులో మొదటి దశలో 26 కిలోమీటర్ల దూరంలో మెట్రో నిర్మాణాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ మొదటి కారిడార్ పీఎన్‌బీఎస్ నుండి గన్నవరం వరకు విస్తరించనుంది.