మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు
మహారాష్ట్రలోని అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఆ ఘర్షణ హింసాత్మకంగా మారింది. రెండు గ్రూపులు వీధుల్లో రాళ్లు రువ్వుకోవడం వీడియోలో కనపడుతుంది. అంతేకాకుండా, రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆందోళనకారులు వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఇన్ స్టాలో పోస్టు పెట్టడం వల్లే ఈ ఘర్షణ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత ఆ పోస్టును తొలగించినట్లు చెప్పారు. హింస నేపథ్యంలో నగరంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
హింసలో ఒకరు మృతి, ఐదుగిరికి గాయాలు
అకోలాలో చెలరేగిన హింస కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. అలాగే ఒక వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. అకోలాలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పరిపాలన స్పెషల్ రిజర్వ్ పోలీసులను (SRP) మోహరించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అకోలాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అకోలా ఎస్పీ సందీప్ ఘుగే తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అకోలా నగరంలో 144 సెక్షన్ నిషేధం విధించినట్లు ఆయన చెప్పారు.